AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్.. సీసీటీవీ చూసి షాకైన అధికారులు!

కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్.. సీసీటీవీ చూసి షాకైన అధికారులు!

Phani CH
|

Updated on: Jul 02, 2026 | 10:56 AM

Share

హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ క్యాంటీన్‌లో దోశ బిల్లు చెల్లించకుండా తప్పించుకోవాలని ఓ కస్టమర్ తన తల వెంట్రుకను తానే పీకి ప్లేట్‌లో వేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. వెంట్రుక వచ్చిందంటూ హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అతడి మోసం తర్వాత బయటపడటంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఉచితంగా దోశ తినాలన్న ఆశో.. లేక బిల్లు కట్టకూడదన్న పిసనారితనమో తెలీదు కానీ, ఒక కస్టమర్ చేసిన నిర్వాకం ఇప్పుడు హనుమకొండలో హాట్ టాపిక్‌గా మారింది. హోటల్ యాజమాన్యాన్ని బురిడీ కొట్టించబోయి, చివరకు సీసీ కెమెరాద్వారా అడ్డంగా దొరికిపోయాడు. హనుమకొండ ఆర్‌టీసీ బస్టాండ్‌లోని క్యాంటీన్‌కు వచ్చిన ఒక కస్టమర్ దోశ ఆర్డర్ చేశాడు. కాసేపటికి తింటున్న దోశ ప్లేట్‌లో వెంట్రుక వచ్చిందంటూ సదరు కస్టమర్ పెద్దగా అరుస్తూ హంగామా సృష్టించాడు. క్యాంటీన్‌లో అస్సలు శుభ్రత లేదంటూ నిర్వాహకులను తిట్టిపోశాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో క్యాంటీన్ సిబ్బంది ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత, క్యాంటీన్ నిర్వాహకులు అసలేం జరిగిందో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులోని దృశ్యాలు చూసి వారు నోరెళ్లబెట్టారు. కేవలం దోశ బిల్లు ఎగ్గొట్టడం కోసమే, ఆ కస్టమర్ చుట్టుపక్కల ఎవరూ చూడట్లేదని గమనించి.. తన తలపై ఉన్న వెంట్రుకలను తానే పీకి దోశ ప్లేట్‌లో వేసినట్లు స్పష్టంగా రికార్డైంది. ఈ కిలాడీ కస్టమర్ తెలివిని చూసి ఆర్‌టీసీ అధికారులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సైతం ముక్కున వేలేసుకున్నారు. అయితే అప్పటికే ఆ ప్రబుద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టూడెంట్‌ చెంపపై కొట్టిన టీచర్‌.. పాపం.. ఆ విద్యార్థి చెవికి

Lawrence: రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్?

Suriya: రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే..

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ

ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

Follow Us