కాంగ్రెస్‌ ఏడాది పాలన ఎలా ఉంది.? టీవీ9 వేదికగా గ్రాండ్‌ కాంక్లేవ్!

Updated on: Dec 08, 2024 | 10:30 AM

ఎలక్షన్‌ ముందైనా.. ఎలక్షన్‌ తర్వాతైనా... ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సమాజం మనోగతాన్ని అద్దం పట్టడంలో. ఆ ప్రతిబింబాన్ని మీ ముందు ఉంచడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అలాంటి మరో భారీ కార్యక్రమంతోనే మీముందుకు రాబోతోంది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వాట్‌ తెలంగాణ థింక్స్‌ టుడే అంటూ భారీ కాంక్లెవ్‌ నిర్వహించింది టీవీ9 తెలుగు. పాలక, ప్రతిపక్షం నుంచి ఉద్ధండ నేతల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి.. ప్రజల పక్షాన ప్రశ్నించింది. గ్రాండ్‌ సక్సెస్‌ అయిన ఆ షో.. తెలుగు మీడియాలో ఓ సంచలనమైందనే చెప్పాలి. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. రాజకీయంగా ఎన్నో మార్పులు సంభవించాయి. మరిప్పుడు, సరిగ్గా ఏడాది కాంగ్రెస్‌ పాలన తర్వాత.. తెలంగాణ సమాజం ఏమనుకుంటోంది? తమ పాలనపై అధికార పార్టీ ఏమంటోంది? ప్రతిపక్షం విమర్శలేంటి? ఇలాంటి అంశాలపై చర్చించేందుకు… వాట్‌ తెలంగాణ థింక్స్‌ టుడే అంటూ.. మరో గ్రాండ్‌ కాంక్లెవ్‌తో మీ ముందుకు వస్తోంది టీవీ9. బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌తో తెలుగు మీడియా సూపర్‌స్టార్‌గా నిలిచిన టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో జరగబోయే ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ను అస్సలు మిస్సవకండి మరి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Dec 07, 2024 08:22 PM