శ్రీశైలం ఆలయ గోపురంపై నాగుపాము సంచారం

Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 4:52 PM

విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్‌ కాళీ చరణ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కాళీచరణ్‌ శివాజీ గోపురం పైకెక్కి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతుంది.

శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచారం కలకలం రేపింది.  దసరా మహోత్సవాలు సందర్భంగా…  లైటింగ్ వేసేందుకు గోపురం పైకెక్కిన లైటింగ్ సిబ్బందికి నాగుపాము తారసపడింది. దీంతో భయంతో కిందకు దిగిన లైటింగ్ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు.. స్నేక్ క్యాచర్‌ కాళీ చరణ్‌కు సమాచారం ఇవ్వడంతో.. అతడి వచ్చి పామును చౌకచక్యంగా బంధించాడు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం రోజు.. శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యక్షం కావడం పరమేశ్వరుడి మహిమే అంటున్నారు భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 15, 2023 04:50 PM