రోడ్డుపై గాయాలతో పునుగుపిల్లి.. టీవీ9 సమాచారంతో
అరుదైన పునుగుపిల్లి విశాఖలో కనిపించింది. యారాడ కొండ డాల్ఫిన్స్ నోస్ రోడ్ లో గాయపడిన పునుగుపిల్లిని చూసి అటుగా వెళ్తున్న నేవి ఉద్యోగి చలించిపోయి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన వెళ్ళిన స్నేక్ క్యాచర్ నాగరాజు గాయలతో ఉన్న పిల్లిలాంటి జీవిని చూసి పునుగు పిల్లిగా గుర్తించారు. అంతరించిపోయే జాతికి చెందిన పునుగు పిల్లి జనావాసాల మధ్య ప్రత్యక్షం కావడం విచిత్రమని నిపుణులు అంటున్నారు.
అరుదైన పునుగుపిల్లి విశాఖలో కనిపించింది. యారాడ కొండ డాల్ఫిన్స్ నోస్ రోడ్ లో గాయపడిన పునుగుపిల్లిని చూసి అటుగా వెళ్తున్న నేవి ఉద్యోగి చలించిపోయి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన వెళ్ళిన స్నేక్ క్యాచర్ నాగరాజు గాయలతో ఉన్న పిల్లిలాంటి జీవిని చూసి పునుగు పిల్లిగా గుర్తించారు. అంతరించిపోయే జాతికి చెందిన పునుగు పిల్లి జనావాసాల మధ్య ప్రత్యక్షం కావడం విచిత్రమని నిపుణులు అంటున్నారు. రోడ్డు దాటుతుందాగా ఏదో వాహనం డీకొని ఉంటుందని గమనించారు. దాన్ని సంరక్షించి వెటర్నరీ వైద్యుడితో ట్రీట్ మెంట్ చేయించాలని టీవీ 9కు చెప్పగా ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు వైజాగ్ టీవీ9 రిపోర్టర్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ గాయపడిన పునుగు పిల్లిని స్వాదీనం చేసుకున్నారు. విశాఖ జూలో వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: నలుగురు హీరోల దెబ్బకు బాలీవుడ్‌లో రూ.500 కోట్లు ఖల్లాస్
Puspa 02: పుష్ప రాజ్‌గా ఇరగదీసిన బుడ్డోడు..
దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు
War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..