AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!

Phani CH
|

Updated on: Sep 01, 2026 | 5:20 PM

Share

కెనడాకు చెందిన సబ్రీనా ఎమిస్వైన్ నిజామాబాద్‌కు వచ్చి తెలుగు యువకుడు తాటిపాముల సంజయ్‌ను వివాహం చేసుకుంది. కెనడాలో ఒకే కంపెనీలో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. చీరకట్టు, జీలకర్ర బెల్లం, తాళిబొట్టు వంటి సంప్రదాయ వేడుకల్లో సబ్రీనా ఎంతో ఆసక్తిగా పాల్గొంది. ఈ అంతర్జాతీయ వివాహం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రేమకు కులం, మతం, దేశం, భాష, ప్రాంతంతో పనిలేదని మరోసారి రుజువైంది. కెనడాకు చెందిన విదేశీ వధువు సప్త సముద్రాలు దాటి నిజామాబాద్‌కు వచ్చి ఓ తెలుగు యువకుడిని వివాహం చేసుకుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్‌కు చెందిన తాటిపాముల సంజయ్, కెనడాకు చెందిన సబ్రీనా ఎమిస్వైన్ కొంతకాలం క్రితం కెనడాలోని ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న ఈ జంట, నిజామాబాద్‌ వేదికగా ఒక్కటయ్యింది. కెనడాలో పుట్టి పెరిగిన సబ్రీనాకు చీరకట్టు, జీలకర్ర బెల్లం, తాళిబొట్టు కట్టడం, మంగళవాయిద్యాల మోతలు అన్నీ కొత్తే. అయినప్పటికీ, తెలంగాణ సంప్రదాయాలను ఆమె ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటూ, చిరునవ్వుతో ప్రతి వేడుకలో భాగమయ్యారు. ఒకవైపు కెనడా నుంచి వచ్చిన వధువు కుటుంబ సభ్యులు, మరోవైపు నిజామాబాద్ స్థానిక బంధుమిత్రుల సందడితో పెళ్లి వేదిక కళకళలాడింది. వధువు కుటుంబానికి తెలంగాణ సంస్కృతి కొత్త ప్రపంచంలా అనిపించగా, వరుడి కుటుంబానికి కెనడియన్లతో సంబంధం కలుపుకోవడం సరికొత్త అనుభూతిని పంచింది. దేశాలు, సంస్కృతులు వేరైనప్పటికీ పెళ్లి వేదికపై ఆ దూరం ఏమాత్రం కనిపించలేదు. కేవలం బంధాల మధ్య స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే వెల్లివిరిసింది. రెండు భిన్న కుటుంబాలను ఒక్కచోటికి చేర్చిన ఈ ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ATM Robbery: పోలీస్‌ స్టేషన్‌ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టి

ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!

Follow Us