పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా!

Updated on: Aug 25, 2026 | 11:12 PM

మనుషుల మాదిరిగానే పులులకు కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అయితే మనుషుల్లో సాధారణంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తే, పులుల్లో కార్డియోమయోపతి, జన్యుపరమైన లోపాలు, వయసు, తీవ్రమైన ఒత్తిడి, ఇతర అవయవాల వైఫల్యం వంటి కారణాలు గుండె సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా సంరక్షణ కేంద్రాల్లోని తెల్ల పులుల్లో ఇన్‌బ్రీడింగ్ కారణంగా జన్యుపరమైన సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది.

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు, పులులలో సంభవించే గుండె వైఫల్యానికి మధ్య శరీర నిర్మాణపరంగా చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మనుషులలో ప్రధానంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ‘ఎథెరోస్క్లెరోసిస్’ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. కానీ మాంసాహార జంతువైన పులి శరీర తత్వం సహజంగానే అధిక కొవ్వును తట్టుకునేలా ఉంటుంది. కాబట్టి వాటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరి బ్లాక్‌లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. ప్రధానంగా సంరక్షణ కేంద్రాల్లోని పులులలో, ముఖ్యంగా తెల్ల పులులలో ఇన్‌బ్రీడింగ్ కారణంగా వచ్చే జన్యుపరమైన లోపాలు, కార్డియోమయోపతి వంటి సమస్యలు గుండె కండరాలను బలహీనపరుస్తాయి. వీటితో పాటు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి, విపరీతమైన భయం కూడా పులుల కార్డియోవాస్కులర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వయసు పైబడిన పులులలో మూత్రపిండాల వ్యాధులు, ఇతర అవయవాలు క్షీణించడం వల్ల కూడా గుండె వైఫల్యం సంభవించవచ్చు. అలాగే అనారోగ్య సమయాల్లో వైద్య చికిత్స కోసం ఇచ్చే మత్తుమందుల మోతాదును అప్పటికే బలహీనంగా ఉన్న వృద్ధ పులుల శరీరం తట్టుకోలేక హృదయ స్పందన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!

Loading...
Unable to load recommendations.
Follow Us