టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??

|

Oct 30, 2024 | 8:32 PM

ప్రస్తుత జనరేషన్‌లో టాటూల క్రేజ్ విపరీతంగా పెరిగింది. చేతులు, మెడ, వీపు, ఇలా శరీరంలోని అనేక చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. కొంత మంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను తమ శరీరాలపై టాటూలుగా వేయించుకుంటారు. మరికొందరు తమ శరీరాలపై రకరకాల డిజైన్లను టాటూలుగా వేయించుకుంటున్నారు. మొత్తానికి పురుషులు, మహిళలు అనే తేడా లేదు.

తమ శరీరాలపై వింత వింత టాటూలు కూడా వేయించుకుంటున్నారు. అయితే ఇలా టాటూలు వేయించుకునేవారు ఎప్పుడైనా రక్తదానం చేయాల్సి వస్తే అది వారికి సమస్యగా మారుతుందట. వీరు టాటూ వేయించుకున్న ఏడాది దాకా రక్తదానం చేయడానికి అర్హులు కాదట. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు? చాలా చోట్ల డాక్టర్లు రక్తం దానం చేసేవారి ఒంటిపై పచ్చబొట్టు ఉన్నట్టయితే, వారి రక్తం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే టాటూ వేయించుకున్న వారి రక్తం ఎక్కించుకుంటే అంటువ్యాధులు వస్తాయని భావించి వారి దగ్గర రక్తం తీసుకునే వారు కాదు. కానీ, ప్రస్తుతం ఈ విధానం మారిపోయింది. రక్తదానం చేసే ప్రతి 100 మందిలో 90 మందికి టాటూస్ ఉంటున్నాయి. కాబట్టి, దీనిపై రెడ్ క్రాస్ వారు కొన్ని నియమాలను విధించారు. ఎవరైనా టాటూ వేయించుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారు రక్తదానం చేయటానికి వీల్లేదు. 12 నెలల తరువాత వారు రక్తదానం చేయటానికి అర్హులుగా సూచించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..

ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌ !!

వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!

LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??

Sai Pallavi: బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌

Follow us on