ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును 19.2% పెంచింది. ప్రతి ఆర్డర్‌పై ఇప్పుడు రూ.14.90 వసూలు చేయనుంది, వినియోగదారులపై అదనపు భారం పడింది. 2023 ఆగస్టులో రూ.2 తో ప్రారంభమైన ఈ ఫీజు, ఇప్పుడు రూ.15 మార్కుకు చేరింది. కంపెనీ లాభాల్లో ఉన్నా, వినియోగదారులపై భారం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన వినియోగదారులపై మరోసారి ధరల భారాన్ని మోపింది. ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ‘ప్లాట్‌ఫామ్ ఫీజు’ను ఏకంగా 19.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం నుంచి జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి అదనపు వడ్డన తప్పడం లేదు. తాజా సవరణ ప్రకారం, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.2.40 పైసల వరకు పెరిగింది. గతంలో జీఎస్టీకి ముందు రూ. 12.50గా ఉన్న ఈ ఫీజు, ఇప్పుడు రూ. 14.90కి చేరింది. 2023 ఆగస్టులో కేవలం రూ.2 తో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దశలవారీగా పెరుగుతూ ప్రస్తుతం రూ. 15 మార్కుకు చేరువలో ఉండటం గమనార్హం. జొమాటోకు పోటీగా ఉన్న స్విగ్గీ కూడా ప్రస్తుతం పన్నులతో కలిపి సుమారు రూ. 14.99 వసూలు చేస్తోంది. ముడిచమురు ధరలు, ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్లు మరియు డెలివరీ భాగస్వాముల నిర్వహణ వ్యయం పెరిగిందని కంపెనీ పేర్కొంటోంది. తన లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవడంతో పాటు ‘యూనిట్ ఎకనామిక్స్’ను బలోపేతం చేసే దిశగా జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు వార్తలతో జొమాటో మాతృ సంస్థ ‘ఎటర్నల్’ షేర్లు శుక్రవారం మార్కెట్లో 1.86 శాతం లాభపడి రూ. 233 వద్ద ముగిశాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 102 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ, సామాన్య వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో భారం వేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Beetroot: బీట్‌రూట్ జ్యూస్ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం