దేశంలో అత్యధిక ట్యాక్స్‌లు వీటి మీదే..!
ప్రస్తుతం దేశంలో GST పేరుతో పన్నులు వసూలు చేస్తోంది ప్రభుత్వం. 2017 జూలై 1 నుండి ఇది అమలులోకి వచ్చింది. వివిధ వస్తువులు, సేవలపై పన్ను వసూలు కోసం జీఎస్టీని 5 వేర్వేరు పన్ను స్లాబ్‌లుగా విభజించారు. అవి 0%, 5%, 12%, 18%, 28%. అయితే పెట్రోలియం ఉత్పత్తులు , మద్యం పానీయాలు, విద్యుత్తుపై జీఎస్టీ కింద పన్ను విధించరు. వీటిపై మునుపటి పన్ను విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు విధిస్తాయి. అయితే మనం ఏయే వస్తువులపై అధికంగా ట్యాక్స్ చెల్లిస్తున్నామో ఇప్పుడు చూద్దాం.
జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 226 ఉత్పత్తులను 28 శాతం పన్ను శ్లాబ్‌లో చేర్చారు. అయితే కాలక్రమేణా ఈ జాబితా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం 35 ఉత్పత్తులు మాత్రమే ఈ స్లాబ్ కిందకు వస్తాయి. వీటిలో ప్రధానంగా విలాసవంతమైనవి లేదా అత్యవసరం కానివి ఉంటాయి. అవి.. సిమెంట్, ఆటోమొబైల్ విడిభాగాలు, టైర్లు, మోటారు వాహనాల పరికరాలు, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా, విమానాలు, సినిమా టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం, పానీయాలు. కొన్ని సంవత్సరాల క్రితం 28% పన్ను శ్లాబ్‌లో చేర్చిన 15 వస్తువులను 18% పన్ను శ్లాబ్‌కు తగ్గించారు. వీటిలో వాషింగ్ మెషీన్, 27 అంగుళాల టీవీ, వాక్యూమ్ క్లీనర్, ఫ్రిడ్జ్, పెయింట్ వంటి వస్తువులు ఉన్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

