Vande Bharat: వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

Updated on: Jan 21, 2026 | 9:55 AM

ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ రద్దు, రీఫండ్ నిబంధనలపై అనేక మందికి సందేహాలున్నాయి. రైలు బయలుదేరే సమయానికి ఎంత ముందు టికెట్ రద్దు చేస్తారనే దానిపై రీఫండ్ ఆధారపడి ఉంటుంది. 72 గంటల ముందు రద్దు చేస్తే 25% ఛార్జీలు, 72-8 గంటల మధ్య రద్దు చేస్తే 50% ఛార్జీలు కట్ అవుతాయి. 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు చేస్తే రీఫండ్ ఉండదు. ప్రయాణాన్ని రద్దు చేయాలనుకుంటే ముందుగా చేయడం మంచిది.

ప్రధాని మోదీ దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును తాజాగా ప్రారంభించారు. అయితే ఈ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మనీ రిఫండ్‌ వస్తుందా? ఎన్ని గంటల ముందు క్యాన్సిల్‌ చేయాలి? ఆ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని కామాఖ్య వరకు నడిచే ఈ ఆధునిక రైలు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల్లో పూర్తి చేస్తుంది. వందే భారత్ స్లీపర్ రైలు ఇతర సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే టికెట్ బుకింగ్, రాయితీల నియమాల్లో వేరుగా ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మనీ రిఫండ్ అవుతుందా లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. మీకు వచ్చే రిఫండ్ డబ్బులు మీరు మీ టికెట్‌ను రైలు బయలుదేరే సమయానికి ఎన్ని గంటల ముందు క్యాన్సిల్ చేసుకున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సమయాన్ని బట్టి రిఫండ్‌లో మార్పులు ఉంటాయంది. రైల్వేలు ఈ రైలు కోసం మూడు టైమ్ స్లాట్స్‌ తీసుకువచ్చింది. ఈ టైమింగ్స్‌ ఆధారంగా మీకు మనీ రీఫండ్ అవుతుంది. మీరు మీ టికెట్‌ను ఎంత ఆలస్యంగా రద్దు చేస్తే, అంత ఎక్కువ మొత్తంలో ఛార్జీలు కట్ అవుతాయి. అందువల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే ముందుగానే నిర్ణయం తీసుకోవడం మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైలు బయలుదేరే సమయానికి 72 గంటల ముందుగా కన్ఫార్మ్ అయిన వందే భారత్ స్లీపర్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, పూర్తి ఛార్జీ మాత్రం తిరిగి రాదు. మొత్తం టికెట్ ధరలో నుంచి 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీలు కింద కట్ చేసి, మిగిలిన మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు రిఫండ్ అవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేస్తే, రిఫండ్ మరింత తగ్గుతుంది. ఈ సమయంలో రద్దు చేసుకుంటే మొత్తం ఛార్జీలో 50 శాతం కట్ అవుతుంది. ఇక మీరు చివరి నిమిషంలో , రైలు బయలుదేరే సమయానికి 8 గంటల కంటే తక్కువ సమయంలో టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే, ప్రయాణికుడికి ఒక్క రూపాయి కూడా వాపసు రాదు. అలాగే, రైలు బయలుదేరిన తర్వాత టికెట్‌ను క్యాన్సిల్‌ చేయకపోతే లేదా ఆన్‌లైన్‌లో TDR దాఖలు చేయకపోతే కూడా ఛార్జీల రిఫండ్ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి

గ్రీన్‌లాండ్‌ కు సైనిక బలగాల తరలింపు

Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్‌ రిపోర్ట్