‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

Updated on: Jun 17, 2026 | 5:04 PM

బెంగళూరు-ఎర్నాకులం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వరుస ఆలస్యాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఒక సర్వీస్ ఏకంగా తొమ్మిది గంటలు ఆలస్యంగా చేరుకోవడంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ పనుల వల్లే ఆలస్యమని రైల్వే అధికారులు చెబుతున్నప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

సెమీ-హై-స్పీడ్ రైలుగా పేరొందిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బెంగళూరు – ఎర్నాకులం మార్గంలో నడిచే వందేభారత్ రైలు ఒక నెల రోజులు వరుసగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఆ రైలు ఏకంగా తొమ్మిది గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో, ఆగ్రహించిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా నేరుగా మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు. అత్యవసర రైల్వే వసతుల నిర్వహణ పనులు జరగడం వల్లే ఈ అంతరాయం అని అధికారులు వివరించారు. అటు బెంగళూరు నుంచి, ఇటు ఎర్నాకులం నుంచి వచ్చే రెండు వైపుల సర్వీసులు గంటల తరబడి ఆలస్యమయ్యాయని అన్నారు. అయితే ప్రయాణికులకు ఈ ఆలస్యంపై ముందే సమాచారం ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కేరళ, బెంగళూరు మధ్య నిత్యం వేలాది మంది ఐటీ నిపుణులు, విద్యార్థులు ఈ రైలుపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. వందేభారత్ ఆలస్యం వల్ల తమ ఆఫీస్ విధులు, విద్యా షెడ్యూళ్లు, తదుపరి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీగా ఉండే ఈ కారిడార్‌లో సమస్యను ఇండియన్ రైల్వేస్ పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన అతను నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్‌

ఆస్తులు పంచి.. అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి.. కుటుంబం ఆత్మహత్య

స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!

కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..

Brazil : ప్రాణం తీసిన బంగీజంప్‌.. ఏం జరిగిందంటే..

Follow Us