ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 15 లక్షల వరకు నో ట్యాక్స్‌ ??

Updated on: Jan 22, 2026 | 9:45 AM

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024 మధ్యతరగతికి తీపి కబురు అందించనుంది. సెక్షన్ 87A కింద పన్ను రిబేటు పరిమితిని రూ. 1.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది, ఇది విప్లవాత్మక మార్పు. 2025 ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చర్య ద్రవ్యోల్బణం నుండి మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గొప్ప ఊరటనిస్తుంది, వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది.

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ 2026-27లో కొత్త పన్ను విధానం కింద ఆదాయపు పన్ను రాయితీలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87A కింద ఇచ్చే పన్ను రిబేటు పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే గణనీయంగా పెంచి దాదాపు రూ. 1.5 లక్షల వరకు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం సెక్షన్ 87A రిబేటును రూ. 1.5 లక్షలకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే, భారత పన్ను చరిత్రలో అది ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. ఈసారి ఆదాయపు పన్ను చట్టం 2025, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానాన్ని భర్తీ చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. ప్రజల చేతుల్లో డబ్బు ఎక్కువగా ఉంటే, మార్కెట్‌లో వస్తువుల కొనుగోలు పెరిగి డిమాండ్ పెరుగుతుంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పై సామాన్యుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లాస్ట్‌ ఇయర్‌.. 2025 కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో.. సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఆదాయం.. పన్ను రహితంగా ఉంటుందని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం మధ్యతరగతికి భారీ ఉపశమనం కల్పించింది. దానితో పాటు పన్ను స్లాబ్‌లను సవరించడం ద్వారా స్టాండర్డ్ డిడక్షన్‌ పరిమితిని రూ. 4 లక్షలకు పెంచారు. అదనంగా జీతం పొందే వ్యక్తులకు ఇప్పటికే రూ. 75,000కి పెంచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌