Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

Updated on: May 21, 2026 | 4:03 PM

ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. myAadhaar పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునే గడువును 2027 జూన్ 14 వరకు పొడిగించింది. ఇదే సమయంలో కొత్త ‘Aadhaar app’ను అందుబాటులోకి తీసుకొచ్చిన UIDAI, మెరుగైన భద్రతా ఫీచర్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కోట్లాది మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఆధార్ కార్డు వినియోగదారులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునే గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, పౌరులు 2027 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా తమ డాక్యుమెంట్లను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. మే 13న విడుదల చేసిన అధికారిక మెమోరాండం ప్రకారం UIDAI ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మరోవైపు టెక్నాలజీ పరంగా కూడా UIDAI కీలక మార్పులు చేపట్టింది. పాత ‘ఎంఆధార్‌’ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో మరింత సురక్షితమైన, అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త ‘Aadhaar app’ను ప్రజల్లోకి తెచ్చింది. ఇందులో మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, సులభమైన సేవలు, క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్ సదుపాయాలను కల్పించారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ కొత్త యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 2.1 కోట్ల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే 28 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను, సుమారు 6 లక్షల మంది తమ చిరునామాలను విజయవంతంగా అప్‌డేట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ సరికొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us