Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే..

Updated on: Dec 20, 2025 | 7:51 PM

డిసెంబరు 20న బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర కేజీకి ₹5000 పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల అస్పష్టత ధరల పెరుగుదలకు కారణం. నిపుణుల అంచనా ప్రకారం, 2025లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,34,180, కిలో వెండి ₹2,14,000 పలుకుతోంది.

డిసెంబరు 20 శనివారం నాడు బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. వెండి మాత్రం పరుగులు తీస్తోంది. శనివారం కేజీ వెండిపై రూ.5000 పెరిగింది. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. 2025లో బంగారం ధరలు మొత్తం సంవత్సరంలో సుమారు 63 శాతం వరకు ఎగబాకాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు వంటి అంశాలు బంగారానికి మరింత బలం చేకూర్చాయి. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శనివారం 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 1,34,180, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 గా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి రూ.2,14,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,34,330 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,150 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,23,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,34,180 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,14,000 పలుకుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం ఒంటి గంటకు నమోదైనవి. ఇవి తరువాత పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం

ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??

తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్‌ మహిళ

Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్‌ వైరల్‌.. తప్పులు దిద్దుకుంటా

Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు