జీవితాంతం కరెంటు బిల్లు ఫ్రీ.. ఒక్కసారి పెట్టుబడితో

Updated on: Dec 12, 2025 | 6:27 PM

"ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన"తో కరెంట్ బిల్లుల భారం నుండి విముక్తి పొందండి. ఈ పథకం కింద మీ ఇంటి పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్రం రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. ఉత్పత్తి అయిన కరెంట్‌ను వాడుకుని, మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇది విద్యుత్ ఖర్చులను తగ్గించి, పర్యావరణానికి మేలు చేస్తుంది.

మనలో చాలామంది కరెంట్ బిల్లుకు భయపడి కొన్ని రకాల వస్తువులు కొనాలంటేనే భయపడుతుంటారు. అయితే, ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని తగినంత కరెంట్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పేరుతో కేంద్రం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటిపై తయారయ్యే కరెంటులో అవసరమైనంత వాడుకుని.. మిగతాది అమ్ముకునే వెసులుబాటు కూడా ఈ పథకంలో ఉంది. ఈ పథకం కింద ఇంటి పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం తొలగిపోవడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించవచ్చు. సాధారణంగా వేసవిలో చాలా మంది ఏసీ ఉన్న గదిలోనే కాలక్షేపం చేస్తుంటారు. పిల్లల కోసం వేరే గదిలో AC పెట్టాలనుకున్నా, కరెంట్ బిల్లు గురించి ఆలోచించి, వెనక్కి తగ్గుతారు. అలాంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగకరం. ఇక కరెంట్ బిల్లులకు భయపడి కొన్ని రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనేందుకు ఆలోచించే వారికి కూడా ఈ పథకం పెద్ద ఊరట. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన విద్యుత్‌ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా కరెంట్ బిల్లులు తక్కువగా వస్తాయి. అంతేకాదు, దీని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2027 నాటికి ఈ పథకం కింద ఒక కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రతి సంవత్సరం రూ. 75,000 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు

Rajinikanth: రజినీకాంత్‌ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్ర చేజార్చుకున్న ఐశ్వర్యారాయ్‌

మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్

వాహనదారులకు అలర్ట్‌.. ఇలాంటివారికి నో పెట్రోల్‌

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు