Easy Bank Loan: మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్లు

|

Aug 14, 2024 | 3:29 PM

బ్యాంక్​ లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్​న్యూస్. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తాము సేకరించే క్రెడిట్ రిపోర్టును 15 రోజులకు ఒకసారి కచ్చితంగా అప్డేట్ చేయాలని ఆర్​బీఐ ఆదేశించింది. గతంలో 30 రోజులకు ఒకసారి బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ నివేదికను అప్‌డేట్‌ చేసేవి. తాజాగా ఆ గడువును 15 రోజులకు కుదిస్తూ ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ చేశారు.

రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఉదాహరణకు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఈజీగా లోన్లు మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే వారికి లోన్లు ఇస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడవు కూడా. అదే 550 సిబిల్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఇష్టపడవు. వారికి లోన్లు ఇవ్వడం ప్రమాదకరమని భావిస్తాయి. ఒకవేళ లోన్లు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.

బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) వారు సేకరించిన క్రెడిట్ సమాచారాన్ని 15 రోజులకొకసారి అప్డేట్ చేయాలి. అంటే నెలలోని 15వ రోజు, చివరి రోజు క్రమం తప్పకుండా అప్డేడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, సీఐసీలు సమర్పించిన క్రెడిట్ రిపోర్టు 7 రోజులలోపు నిర్ధారణ అవుతుంది. బ్యాంకుల నుంచి క్రెడిట్ నివేదికను కంపెనీలు ఐదు రోజుల్లో పొందొచ్చు. అంతకుముందు వారం రోజుల వ్యవధి ఉండేది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును సమర్పించని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై చర్యలు ఉంటాయి. పై నిబంధనలన్నీ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్నేషన్ కంపెనీలు అంతకు ముందే వీటిని అమలు చేయమని ఆర్​బీఐ ప్రతిపాదించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on