ఇక ఈ బ్యాంకులు కనిపించవా ?? ఎందుకు ఇలా చేస్తున్నారు ??
భారతదేశంలో ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రక్రియ మలిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 12 బ్యాంకులను 8కి తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసి, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా పెద్ద బ్యాంకులు అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గతంలో 27 నుండి 12కి తగ్గిన ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు మరింత కుదించబడుతోంది, ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక మార్పు.
2020 లో అప్పుడు చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మలివిడత విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పుడు 12 ప్రభుత్వ బ్యాంకుల్ని.. 8 కి పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకుల విలీనం , ప్రైవేటీకరణ మంచిదేనని అన్నారు. అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే పెద్ద బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకులతో ఇది సాధ్యం కాదని దీంతో మరోసారి విలీనం జరగక తప్పదని అన్నారు. తాజాగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తన మద్దతు ప్రకటించారు. అప్పటికి కూడా చిన్న బ్యాంకులు మనుగడలోనే ఉంటాయని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకోవడం కోసం కేంద్రం.. 2017 నుంచి విలీనాల్ని ప్రారంభించింది. గతంలో 27 గా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య. 12కు తగ్గాయి. 2020లోనే చూస్తే.. 10 చిన్న ప్రభుత్వ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిశాయి. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. అలహాబాద్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో విలీనమైంది. ఇప్పుడు విలీన పరిశీలనలో ఉన్న బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసేందుకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇదే జరిగితే అప్పుడు ఎస్బీఐ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో అతిపెద్ద బ్యాంకుగా మారుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న బ్యాంకుల్ని ఎస్బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంకు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయొచ్చని తెలుస్తోంది. అప్పుడు కేవలం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులే ఉండనున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట
ఫోర్బ్స్ కవర్ పేజీపై కోదాడ కుర్రాడు జానీ పాషా
Jr NTR: వెండితెర మీద 25 ఏళ్లు పూర్తి చేసుకున్న NTR
Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..
