అక్టోబర్‌ 1 నుంచి మారిన రూల్స్‌ ఇవే

Updated on: Oct 02, 2025 | 4:51 PM

అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 1, 2025 నుండి రైల్వే నిబంధనలు మారాయి. రైల్వేలు జనరల్ రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకునే నియమాలలో పెద్ద మార్పును చేసింది. IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకునే మొదటి 15 నిమిషాలకు ఆధార్ ధృవీకరణ ఇప్పుడు తప్పనిసరి చేసింది.

అంటే మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ చేసి, మీ మొబైల్ ఫోన్‌లో వచ్చిన OTPని నమోదు చేయకపోతే మీరు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. అక్టోబర్‌ 1 నుంచి వినియోగదారులు PhonePe, GPay లేదా ఇతర చెల్లింపు యాప్‌లను ఉపయోగించి స్నేహితులు, బంధువులు లేదా మరెవరి నుండి అయినా నేరుగా డబ్బును అభ్యర్థించలేరు. UPI “కలెక్ట్ రిక్వెస్ట్” లేదా “పుల్ ట్రాన్సాక్షన్” ఫీచర్ పూర్తిగా నిలివేస్తున్నారు. UPI లావాదేవీలను సురక్షితంగా చేయడానికి, ఆన్‌లైన్ మోసం, ఫిషింగ్‌ను నివారించడానికి NPCI ఈ చర్య తీసుకుంది. ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లపై మాత్రం చమురు కంపెనీలు 15 రూపాయిలు పెంచాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ జాతీయ పెన్షన్ సిస్టమ్ లో అక్టోబర్ 1నుండి ఒక మార్పు వచ్చింది. మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ అని పిలువబడే ఈ సంస్కరణ ఇప్పుడు ప్రభుత్వేతర రంగ ఉద్యోగులు, కార్పొరేట్ నిపుణులు, గిగ్ వర్కర్లు ఒకే పాన్ నంబర్‌ని ఉపయోగించి బహుళ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైరసీపై ఉక్కుపాదం.. స్ట్రాంగ్ వార్నింగ్..!

బీసీసీఐ ముందు తలవంచిన పీసీబీ చీఫ్

అమెరికా సెనెట్ లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు

ఆందోళనకారులపై పాక్ సాయుధ బలగాల కాల్పులు

Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్‌ కపూర్‌

Published on: Oct 02, 2025 04:51 PM