వాహనదారులకు అలర్ట్.. టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు బంద్

Updated on: Apr 10, 2026 | 8:05 PM

భారతదేశంలో టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే లక్ష్యంతో, నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత చెల్లింపులు అమల్లోకి వచ్చాయి. వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే చెల్లించాలి. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు యూపిఐ ద్వారా 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని వేగవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

భారత్లో టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగులు వేసింది. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత చెల్లింపులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు మాత్రం, టోల్ ధర కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ చెల్లింపులను యూపిఐ ద్వారా చేసేందుకు టోల్ ప్లాజాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు, ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ₹100 చెల్లించాల్సిన చోట, ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలు యూపిఐ ద్వారా ₹125 చెల్లించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmastra: పోఖ్రాన్ లో ఆర్మీ బ్రహ్మాస్త్ర విన్యాసాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వాన

ఆంటీ అని పిలిచినందుకు.. మేల్‌ నర్స్‌కు జరిమానా

నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us