ముఖేశ్ అంబానీ వీడియో వైరల్‌.. మోసపోయిన డాక్టర్

|

Jun 24, 2024 | 4:31 PM

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా.. అధిక రాబడి ఆశించి, దానిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు కృత్రిమ మేథ సాంకేతికతను వినియోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌ వీడియోలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ తరహాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ డీప్‌ఫేక్ కారణంగా ఓ వైద్యుడు మోసపోయారు.

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా.. అధిక రాబడి ఆశించి, దానిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు కృత్రిమ మేథ సాంకేతికతను వినియోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌ వీడియోలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ తరహాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ డీప్‌ఫేక్ కారణంగా ఓ వైద్యుడు మోసపోయారు. మహారాష్ట్రలోని అంథేరీకి చెందిన డాక్టర్ పాటిల్‌కు ఇన్‌స్టాగ్రాం ఖాతా లక్ష్యంగా ఒక వీడియో దర్శనమిచ్చింది. రాజీవ్ శర్మ ట్రేడ్‌ గ్రూప్‌, దానికి చెందిన బీఎస్‌ఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో పెట్టుబడులు పెడితే భారీ రిటర్న్స్‌ వస్తాయని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఆ సంస్థ గురించి వెతికితే ముంబయి, లండన్‌లో దాని కార్యాలయాలు ఉన్నట్లు ఆయనకు కనిపించింది. దాని గురించి ముకేశ్‌ అంబానీయే ప్రచారం చేసినట్టుగా ఉండటంతో ఆయన కేటుగాళ్ల కుట్రలో చిక్కారు. దాంతో ఆయన ఏడు లక్షల రూపాయలను 16 బ్యాంక్ ఖాతాలకు పంపించారు. చెప్పినట్టుగానే ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో భారీ లాభాలు కనిపించాయి. దాంతో ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా..సాధ్యం కాలేదు. అప్పటికిగానీ తాను మోసపోయానన్న విషయం పాటిల్‌కు అర్థం కాలేదు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. అప్పుడే మోసగాళ్లు డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడారని బయటపడింది. ఖాతాల అక్రమ లావాదేవీలను బ్లాక్‌ చేసేలా బ్యాంకులకు పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పృహ వచ్చి చూసే సరికి అమ్మాయిగా మారిన అబ్బాయి

Follow us on