రూపాయి @ రూ 91.65.. ఎందుకీ పరిస్థితి ??
డాలర్‌తో రూపాయి మారకం రేటు చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఆర్థిక పునాదులు బలంగా ఉన్నా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్‌బీఐ జోక్యం లేకపోవడం రూపాయి క్షీణతకు కారణం. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, రూపాయి త్వరలోనే డాలర్‌కు 92 మార్కును అధిగమించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం.
మన ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయా? ఆ ప్రభావం రూపాయి మారకం రేటుపై ఎందుకు కనిపించడం లేదు? డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకీ దిగజారిపోతోంది. తాజాగా అమెరికా డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్ మారకంలో ఒక్కరోజే 68 పైసలు నష్టపోయి రూ. 91.65 వద్ద ముగిసింది. గత ఏడాది నవంబరు 21 తర్వాత డాలర్‌తో రూపాయి విలువ ఒకేరోజు ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. ఆ రోజు డాలర్‌తో రూపాయి మారకం రేటు 98 పైసలు నష్టపోయింది. బుధవారం ఇంట్రాడేలో ఒక దశలో రూపాయి మారకం రేటు 91.74 వరకు నష్టపోయింది. పెట్టుబడుల ప్రవాహంలో తలెత్తిన ఆటుపోట్లతో భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల కరెన్సీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 2026 జనవరిలో ఇప్పటి వరకు డాలర్ తో రూపాయి మారకం రేటు 1.5 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. గ్రీన్లాండ్‌పై అమెరికా-ఈయూ దేశల మధ్య మాటల యుద్ధం, దేశీయ స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బేర్ ఆపరేటర్ల పట్టు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం రేటును కుంగదీస్తున్నాయి. రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవడం కూడా రూపాయి పతనానికి కారణంగా ఉంది. అయితే ఏదో ఒక సానుకూల పరిణామం జరగకపోతే డాలర్ మారకంలో రూపాయి త్వరలోనే 92 మార్కును అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా వేలు ట్రిగ్గర్ పైనే ఉంది.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
భారీ వర్షంలోనూ పరేడ్.. ఆసక్తిగా తిలకించిన జనం
పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు