నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
రైల్వే టికెట్ ధరలు డిసెంబర్ 26 నుండి పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరగడమే దీనికి కారణం. 215 కి.మీ పైన జనరల్ టికెట్లపై రూ.5 నుండి రూ.20 వరకు, స్లీపర్ క్లాస్‌కు కి.మీకి 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్, ప్రీమియం రైళ్లకు కి.మీకి 2 పైసలు అదనపు భారం పడనుంది. సబర్బన్ రైలు చార్జీలు మారలేదు. రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వారం ప్రారంభంలో టికెట్ చార్జీలు రైల్వే శాఖ పెంచిన విషయం తెలిందే.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వారం ప్రారంభంలో టికెట్ చార్జీలు రైల్వే శాఖ పెంచిన విషయం తెలిందే. పెరిగిన చార్జీలు డిసెంబరు 26 నుంచి అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 26కు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ కొత్త చార్జీలు వర్తించవని రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందుకే టికెట్ ధరల్ని పెంచామని రైల్వే వెల్లడించింది. ఈ సంవత్సరం జులైలో ఒకసారి రేట్లను రైల్వే శాఖ సవరించిన సంగతి తెలిసిందే. అలాగే, సబర్బన్ రైలు ప్రయాణ చార్జీలు యథాతథంగా కొనసాగనున్నాయి. సవరించిన టికెట్ ధరల ప్రకారం..జనరల్ టికెట్ మీద 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించేవారికి ఎలాంటి భారమూ లేదు. 216 కిలోమీటర్ల నుంచి 750 కిలోమీటర్ల మధ్య ప్రయాణించే ప్రయాణీకులు అదనంగా ఒక టికెట్ మీద రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 751 కి.మీ నుంచి 1,250 కి.మీ వరకు ప్రయాణించే వారు రూ.10, అదే 1,251 కి.మీ నుంచి 1,750 కి.మీ మధ్య ప్రయాణాలకు రూ.15 అదనంగా, 1,751 కి.మీ నుంచి 2,250 కి.మీ వరకు దూరాలకు రూ.20 అదనపు భారం పడనుంది. ఇక స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెరిగాయి. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లలోని స్లీపర్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్‌తో పాటు రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి అన్ని ప్రీమియం రైళ్లలో కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి. అంటే.. ఈ కేటగిరీలో ప్రతి 500 కిలోమీటర్లకు 10 రూపాయల చొప్పున టికెట్ ధర పెరిగింది. ఈ పెంపు వల్ల సంవత్సరానికి రూ.600 కోట్ల ఆదాయం రైల్వేలకు సమకూరుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్ డల్.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
