గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??

Updated on: Jun 27, 2025 | 5:59 PM

ఈ రోజుల్లో ఇంటింటా ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగం బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 33 కోట్ల కుటుంబాలు LPG సిలిండర్లను వాడుతున్నాయి. అయితే, మనం వాడే ఈ వంట గ్యాస్‌లో మెజారిటీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనేది మాత్రం మనలో చాలామందికి తెలియదు. మనం వాడే ప్రతి మూడు సిలిండర్లలో రెండింటిలో ఉండే గ్యాస్.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచే దిగుమతి అవుతోంది.

కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతానికి ముగిసినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో గ్యాస్ ధర పెరగటమే గాక.. దాని కొరత తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఈ అంశంపై మరింత చర్చ జరుగుతోంది. మనదేశంలో మొత్తం LPG ట్యాంకేజ్ సామర్థ్యం దాదాపు 1189.7 TMT. ఒకసారి ఈ మొత్తం మనం నిల్వచేసుకుంటే.. దాదాపు 15 రోజుల పాటు వంట గ్యాస్ అవసరాలు తీరినట్లే. ఉన్న గ్యాస్‌ను ఒక వైపు మనం వాడుకుంటుంటే.. విదేశాల నుంచి దిగుమతి అయిన గ్యాస్‌ను నిల్వ చేస్తూ మన మార్కెట్ డిమాండ్‌ను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికి యుద్ధం ఆగినా.. వెంటనే మనకు సరఫరా చేసే దేశాలు పెద్ద మొత్తంలో గ్యాస్ సరఫరా చేసే అవకాశం కనిపించటం లేదు. దీంతో మన దేశీయ మార్కెట్‌లో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల గ్యాస్ ధరలు పెరిగినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితిలో..అమెరికా, యూరప్, మలేషియా లేదా ఆఫ్రికా దేశాల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ తీసుకు రావచ్చనీ, కానీ, అందుకు ఎక్కువ సమయం పడుతుందని వారు చెబుతున్నారు. భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్‌ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, ప్రస్తుతానికి యుద్ధం ఆగినందున, వీలున్నంత త్వరగా గ్యాస్ నిల్వలను భర్తీ చేసుకుంటామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ

ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌