రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??

Updated on: Jan 22, 2026 | 9:15 AM

మోదీ 3.0 ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026న సమర్పించే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ద్రవ్యోల్బణం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, ఈ బడ్జెట్‌లో రైతులకు పీఎం కిసాన్ నిధుల పెంపు (₹6,000 నుండి ₹10,000 లేదా రెట్టింపు), కొత్త ఆదాయపు పన్ను బిల్లు, మౌలిక సదుపాయాల కల్పనపై భారీ కేటాయింపులు ఆశిస్తున్నారు. నిపుణులు, సాధారణ ప్రజలకు ముఖ్య ప్రకటనలు ఉంటాయని అంచనా.

మోదీ 3.0 ప్రభుత్వం మూడవ బడ్జెట్ ఫిబ్రవరి 1, 2026న సమర్పించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ బడ్జెట్ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. సాధారణ ప్రజలకు అనేక ముఖ్య ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నారు. రైతుల నుంచి పని చేసే నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బడ్జెట్లో ప్రధాన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అవి దేశ ఆర్థిక వ్యవస్థను , తయారీ రంగాన్ని పెంచుతాయని కూడా భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమైన ప్రకటనల గురించి సూచనలు ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టవచ్చు. 64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ బడ్జెట్‌లో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్‌ నిధుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వస్తుందనే దానిపై ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వార్షిక బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ సాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున అందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ పరికరాలు గతంలో కంటే ఖరీదైనవిగా మారాయి. అటువంటి పరిస్థితులలో వార్షిక సహాయం రూ. 6,000 చాలా తక్కువ అనేది రైతుల అభిప్రాయం. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి, తఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని రైతులు భావిస్తున్నారు. రైతులకు ఉపశమనం కలిగించడానికి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉందా లేదా కనీసం పది వేల రూపాయలకు పెరగనుందా చూడాలి. ప్రాణాలను రక్షించే మందులు, ఔషధ రంగానికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాల కోసం మూలధనాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత బడ్జెట్ ఉన్న రూ.50 లక్షల కోట్లు. ఈసారి రూ.60 లక్షల కోట్లు దాటవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌