Insurance Claim Reject: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎప్పుడెప్పుడు రిజెక్ట్ చేస్తారో తెలుసా?

|

Apr 06, 2024 | 6:53 PM

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి ఒక్కరికి అవసరమే. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్య బీమాను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. ఆరోగ్య బీమా అవసరం. ఇది ఆసుపత్రి ఖర్చుల వల్ల మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేస్తుంది. కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి సాధారణ వైరల్ లేదా డెంగ్యూ సోకితే, ఆసుపత్రి బిల్లు 2-3 లక్షలు అవుతుంది. గుండె ఆపరేషన్,..

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి ఒక్కరికి అవసరమే. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్య బీమాను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. ఆరోగ్య బీమా అవసరం. ఇది ఆసుపత్రి ఖర్చుల వల్ల మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేస్తుంది. కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి సాధారణ వైరల్ లేదా డెంగ్యూ సోకితే, ఆసుపత్రి బిల్లు 2-3 లక్షలు అవుతుంది. గుండె ఆపరేషన్, లేదా కిడ్నీ మార్పిడి అవసరమైతే ఖర్చు రూ.10 నుంచి 15 లక్షలకు చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా లేకపోతే, అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. ఒక్కోసారి ఆరోగ్య బీమా ఉన్నా.. మీరు దాని ప్రయోజనాన్ని పొందలేరు. ఎందుకంటే బీమా కంపెనీ క్లెయిమ్‌ను చెల్లించడానికి నిరాకరిస్తుంది. ఒక పాలసీదారుగా, మీరు దీనికి కారణాలను తెలుసుకోండి. కొన్ని కారణాల వల్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించవచ్చు. మరి కారణాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..