Gold – Silver Prices: బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న బంగారం, వెండి ధరలు

|

Jul 25, 2024 | 5:11 PM

బంగారం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గనున్నాయి. అవును ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి స్వీట్‌ న్యూస్‌ చెప్పారు. బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకం తగ్గించారు. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న భారత్..

బంగారం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గనున్నాయి. అవును ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి స్వీట్‌ న్యూస్‌ చెప్పారు. బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకం తగ్గించారు. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న భారత్ మంగళవారం భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 4.3 శాతం ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక, ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు అందించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై 6 శాతం సుంకం తగ్గించిన కేంద్రం… ప్లాటినమ్ పై 6.4 శాతం మేర సుంకం తగ్గిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రకటన చేసింది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on