Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇప్పట్లో ఆగేలా లేదుగా
పసిడి ప్రియులకు ఊరట లభించింది. చాలా రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం కాస్త తగ్గాయి. దాదాపు నెల రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే సుమారు లక్షా 11 వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.
సెప్టెంబర్ 17, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,170 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,01,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,41,000 రూపాయలుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,700 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,12,030 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,690 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,700 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,02,610 ఉంది. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో భవిష్యత్ అవసరాల కోసం వాటిని ఇప్పుడే కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగల వేళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది గనుక అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు అందరూ అనుకున్నట్లుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంట్లో కారం కొట్టి 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన మహిళ
ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్
తిరుపతి జిల్లా చియ్యవరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
Hyderabad Rains: హైదరాబాద్ లో వరదలకు ఇంకెందరు బలవ్వాలి
Yadadri Bhuvanagiri: చిన్నేటి వాగు వరదలో కొట్టుకుపోయిన యువకుడు