దడ పుట్టిస్తున్న బంగారం ధర.. మండిపోతున్న వెండి..
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. బంగారం ధర వింటేనే పసిడి ప్రియులకు దడ పుడుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అక్టోబర్ 6, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,20,770 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,10,700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,66,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..
సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్ పాటిస్తే సక్సెస్ మీదే
