Today Gold Price: బంగారం ధరలు ఆగేదెప్పుడు ?? తులం ఎంతంటే ??

Updated on: Oct 09, 2025 | 8:23 PM

బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో రాజకీయ గందరగోళం, ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల మధ్య బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.పెరుగుతున్న పసిడితో సామాన్యుడు గ్రాము ధర కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. చుక్కలనంటుతున్న బంగారం ధరలు చూసి.. పండగల వేళ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తింది.

అక్టోబర్ 9, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,26,070 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,16,750గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,58,400 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,090గా ఉండగా, 22 కేరట్ల తులం ధర రూ.1,13,760గా ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,940 గా ఉండగా, 22 కేరట్ల తులం ధర రూ.1,13,610గా ఉంది. బెంగళూరులో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,23,940 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,13,610గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,23,940గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,13,610గా ఉంది. కోల్‌కతా లో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,23,940గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,13,700 ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అయితే స్వల్పకాలికంగా ఒడిదొడుకులు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: ఓదార్పు యాత్ర చేయాలి.. పర్మిషన్ ప్లీజ్

గ్యాస్‌ సిలిండ‌ర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంక‌ర్‌.. తర్వాత

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు

బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి

Lalitha Jewellery: లలిత జువెలరీకి అరుదైన గౌరవం..