Gold Price: దసరా వేళ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే
పండుగ కాలంలో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి సంతోషకరమైన వార్త ఇది. భారీగా పెరుగుతున్న ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గాయి. ఇటీవల కాలంలో సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. అక్టోబర్ 2, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,18,690 రూపాయిలుగా ఉంది.
22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,08,800 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,60,000 రూపాయలుగా ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,510 ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,470 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,460 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,310 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,09,310 ఉంది. బంగారం, వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ మార్కెట్లు హెచ్చు, తగ్గులు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ సినిమాలో సమంత ?? రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం
గాజాలో యుద్ధం మాటున మహిళలపై ఆకృత్యాలు ఎన్నో
రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
విశాఖలో ఈదురుగాలుల బీభత్సం.. కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్‌లు
