Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

Updated on: Oct 08, 2025 | 6:18 PM

బంగారం ధర దూసుకెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర లక్షా 22వేల మార్క్ దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. మరోవైపు సిల్వర్‌ కూడా తగ్గేదేలే అన్నట్టు బంగారంతో పోటీపడుతోంది. కిలో వెండి ధర లక్షా 56వేల మార్క్ దాటి రెండు లక్షల రూపాయల వైపు పరుగులు తీస్తోంది.

దీంతో బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. US ఫెడ్‌ అక్టోబరులో మళ్లీ వడ్డీరేట్లు తగ్గించవచ్చనే అంచనాలు.. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌.. జపాన్‌లో బాండ్‌ ఈల్డ్స్‌తో బంగారం ధరలు పెరుగుతున్నాయి.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పదిగ్రాముల బంగారంపై రూ.1250 వరకు ధర పెరిగింది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,23,780 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,11,860 ఉంది. కేజీ వెండి రూ.1,67,200 లకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,22,030 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ. 1,11,860 ఉంది. కేజీ వెండి రూ.1,67,200 లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,080, 22 క్యారెట్ల ధర రూ.1,12,010 గా ఉంది.. వెండి కేజీ ధర 1,57,100గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర 1,22,030, 22 క్యారెట్ల ధర రూ.1,11,860 గా ఉంది.. వెండి కిలో ధర 1,57,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,030, 22 క్యారెట్ల ధర రూ.1,11,860 ఉంది. వెండి కిలో ధర 1,57,100 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,22,190, 22 క్యారెట్ల ధర రూ.1,12,010గా ఉంది. వెండి కిలో ధర 1,66,900 లుగా ఉంది. అయితే ఈ ధరలు సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. కనుక బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Paralysis: పక్షవాతం లక్షణాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అనుకోని వరంలా మారిన ఉత్తర బెంగాల్ వరదలు

వన్డే కెప్టెన్‌గా గిల్‌ !! రోహిత్‌కు మరో షాక్‌ తప్పదా ??

నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

పోకిరీల ఓవరాక్షన్‌.. చార్మినార్‌ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు