Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
డిసెంబర్ 12న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1910, 22 క్యారెట్ల బంగారంపై రూ.1750 పెరిగాయి. కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.2,04,000 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత రేట్లను తనిఖీ చేయాలని సూచన.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి .ఇటీవల కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోంది. తాజాగా డిసెంబరు 12 శుక్రవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1910 పెరిగి, రూ.1,32,660 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,750 పెరిగి రూ.1,19,450 పలుకుతోంది. కిలో వెండిపై రూ.3000 పెరిగి కేజీ వెండి రూ.2,04,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,32,810 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,750 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,660 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,21,600 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,640, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,500 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,660 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,600 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,32,660 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,21,600 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,04,000 గా కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో మాత్రం వెండి ధర భారీగా పెరిగింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,15,000 లు పలుకుతోంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ
ఆ బ్యాక్‌డ్రాప్ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు
Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా
