రైతు బిడ్డగా పుట్టి.. లక్ష కోట్ల కంపెనీ అధిపతిగా ఎదిగి
సామాన్య రైతు బిడ్డ లలిత్, Groww ఆన్‌లైన్ స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించి చిన్న వయసులోనే బిలియనీర్‌గా ఎదిగాడు. అతని మాతృ సంస్థ Billion Brains Garage Ventures మార్కెట్ విలువ రూ.1 లక్ష కోట్లు దాటింది. మారుమూల గ్రామం నుండి ఐఐటీ, ఆపై వ్యాపారవేత్తగా అతని ప్రయాణం నేటి తరానికి గొప్ప స్ఫూర్తి.
ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఎవరి నుదుటి రాత ఏం చెబుతుందో ఎవరైనా అంచనా వేయగలరా? ఒక్కరోజులో కోటీశ్వరులైన నిరుపేదల సంఘటనలు చూస్తే ఇలాంటి వేదాంతాలతో సరిపెట్టుకుంటారు. కానీ ఈ రైతు బిడ్డ మాత్రం అందుకు భిన్నంగా అడుగులేశారు. ఓ సామాన్య రైతు ఇంట పుట్టిన లలిత్ ఇప్పుడు అతి పిన్న వయసులోనే బిలియనీర్‌గా ఎదిగాడు. నిజంగా చెప్పాలంటే అతని ప్రయాణం.. వేసిన ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తిదాయకమైన లెస్సన్. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామం అయిన లెపాలో రైతు ఇంట పుట్టిన లలిత్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారిమోగిపోతుంది. ఆయన ఎదుగుదలను చూసి తలలు పండిన ఎకనామిస్ట్‌లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన స్థాపించిన ఆన్‌లైన్ స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో ఇప్పుడు స్టాక్ ఎక్సేంజీలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకెళుతున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన ఈ కంపెనీ.. వరుసగా నాలుగో రోజూ లాభాల్లో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎన్‌ఎస్‌ఈలో మరో 13 శాతం లాభంతో 168 వద్ద సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.1లక్ష కోట్ల మార్కు దాటింది. ఒకప్పుడు చదువు కోసం తాతయ్య ఉండే ఖర్గోన్‌కు వెళ్లిన లలిత్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు లేకపోవడంతో స్థానిక భాషలోనే చదువుకున్నారు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో సీటు సంపాధించాడు. బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు రెండూ అక్కడే పూర్తి చేశారు. అయితే ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగులైన హర్ష్ జైన్, ఇషాన్ బన్సల్, నీరజ్ సింగ్‌లతో కలిసి 2016లో ఆన్‌లైన్ స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రోను ఏర్పాటు చేయడమే లలిత్ జీవితంలో కీలక మలుపు అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చందమామ మట్టిని తెచ్చేందుకు.. ముహూర్తం ఫిక్స్ !! అదే జరిగితే..
ప్రధాని వాచ్‌లో రూపాయి కాయిన్..! దాని ప్రత్యేకతలు ఇవే
ఆధార్ కార్డుల అప్డేట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
