ఉద్యోగ వర్గాలకు గుడ్‌ న్యూస్‌.. ఫేస్‌ అథంటికేషన్‌ వచ్చేసిందోచ్‌

Updated on: Apr 17, 2025 | 7:18 PM

కార్మిక, ఉద్యోగ వర్గాలకు కేంద్ర కార్మికశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్‌ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఉద్యోగ భవిష్యనిధి సంస్థ EPFO మరో ముందడుగు వేసింది. ఫేస్‌ అథంటికేషన్‌ ద్వారా యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ UAN ను జనరేట్‌ చేసుకునే వీలును కల్పించింది. దీనిని యాక్టివేషన్‌ చేసుకోవడంతోపాటు సంబంధిత సేవలు కూడా ఫేస్‌ ఆథంటికేషన్‌ ద్వారా పొందవచ్చని పేర్కొంది.

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం డిజిటల్‌ సేవలను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్‌వోలో కొత్తగా చేరిన ఉద్యోగి UMANG యాప్‌ సాయంతో యూఏఎన్‌ను స్వయంగా జనరేట్‌ చేసుకోవచ్చు. ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతిక ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఆధార్‌ ధ్రువీకరణ తర్వాత యూఏఎన్‌ కేటాయిస్తారు. ఆ తర్వాత దానిని యాక్టివేషన్‌ చేసుకునే వీలుంటుంది. కార్డును కూడా అక్కడ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గతంలో యూఏఎన్‌ నంబర్‌ ఉండి, యాక్టివేషన్‌ చేసుకోని వారు ఉమంగ్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.26కోట్ల యూఏఎన్‌లు జనరేట్‌ అయినప్పటికీ.. కేవలం 44లక్షలు మాత్రమే యాక్టివేట్‌ అయ్యాయన్నారు. ఇక పింఛనుదారులకు ఇంటివద్దే సేవలను అందించేందుకు వీలుగా రానున్న రోజుల్లో ఫేస్‌ అథంటికేషన్‌ ఉపయోగించి జీవన్‌ ప్రమాణ్‌ ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లను అందిజేస్తామన్నారు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో.. మైభారత్‌ వాలంటీర్ల సాయం తీసుకుంటుందని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Odela 2: శివశక్తిగా తమన్నా మేజిక్‌ చేసిందా.. ఓదెల 2 ఎలా ఉందంటే ??

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి.. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు.. ఏం జరిగిందంటే..

దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి

బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్‌ హీరో వేధింపులు