ఇక.. సులభంగా ఈపీఎఫ్ విత్ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది.తన ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారుల కోసం విత్‌డ్రా నిబంధనలను సరళీకరించింది. ఇకపై ప్రత్యేక సందర్భాల్లో ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్లోని 100 శాతం వరకు నిధులను విత్‌డ్రాకు వీలు కల్పించింది. కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సెంట్రలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.
అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు లాంటి అత్యవసర సమయాల్లో 100 శాతం వరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఉద్యోగులు తమ వాటాతో సహా యజమాని జమ చేసిన పీఎఫ్ డబ్బులు కూడా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు వివాహం, విద్య రెండింటికీ కలిపి కేవలం 3 సార్లు మాత్రమే పీఎఫ్ అకౌంట్ నుంచి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవడానికి వీలుండేది. కానీ దానిని ఇప్పుడు మరింత సరళీకరించారు. ఇకపై విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5సార్లు ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరించుకునే వీలు కల్పించారు. అలాగే ఉద్యోగులు ఎవరైనా పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే, కనీసం 12 నెలల సర్వీస్ ఉండాలని నిర్దేశించారు. గతంలో పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించాలంటే, కచ్చితంగా దానికి తగిన కారణాలు చెప్పాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమస్యను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన పనిలేదన్నమాట. అయితే పీఎఫ్ ఖాతాదారులు తమ కంట్రిబ్యూషన్‌లో కనీసం 25 శాతాన్ని ఎల్లప్పుడూ బ్యాలెన్స్ ఉంచుకోవాలని ఒక నిబంధన తీసుకువచ్చారు. దీనివల్ల పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదరణకు నోచుకోని ఆదుర్రు స్తూపం
వాహనదారులకు బిగ్ అలర్ట్.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి
