Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

Updated on: Dec 24, 2025 | 12:00 PM

కోడిగుడ్డు, చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. గుడ్డు ధర ₹8కి చేరగా, చికెన్ ₹270/కేజీకి దూసుకెళ్లింది. ఇది చరిత్రలో రికార్డు స్థాయి పెరుగుదల. దాణా ఖర్చులు పెరగడం, తగినంత ఉత్పత్తి లేకపోవడం ప్రధాన కారణాలు. ఈ ధరల పెరుగుదల సామాన్యుల కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర భారం మోపుతోంది, తక్షణ ఉపశమనం కష్టమే.

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే డాక్టర్లు రోజూ గుడ్డు తినమని సూచిస్తారు. కోడిగుడ్డు ధరలు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడిగుడ్డు ధర దారుణంగా పెరిగిపోతుంది. కొన్ని నెలలుగా బ్రేకుల్లేకుండా కోడిగుడ్డు ధర దూసుకుపోతోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.5లు ఉన్న కోడిగుడ్డు ధర ఆ తర్వాత రూ.6లకు పెరిగింది. ఆ తర్వాత ఏడున్నర.. ఇప్పుడు ఏకంగా 8 రూపాయలకు చేరింది. గుడ్డు ధర ఇంతలా పెరగడం చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గుడ్డు ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7.30గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.8కి అమ్ముతున్నారు. ఇక 30 గుడ్లు గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. ఇప్పుడు రూ.210 నుంచి రూ.220కి చేరుకుంది. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని, ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే గుడ్ల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. గుడ్లు అనేవి ప్రతీ ఇంట్లో డైలీ డైట్‌లో వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాటి ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపుతోంది. అటు చికెన్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు కేజీ చికెన్ రూ.230కి లభించగా.. ఇప్పుడు రూ.270 వరకు చేరింది. ఇక నాటు కోడి గుడ్లు అయితే ఒక్కొకటి రూ.15గా ఉంది. దాణా ఖర్చులు భారీగా పెరగటం, తగినంత ఉత్పత్తి లేకపోవటంతో మార్కెట్లో గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు

ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు

వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే

తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

మీ గుడి మీద మైక్‌ లేదా ?? ఈ టీటీడీ ఆఫర్ మీకే