ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా
కొన్నిరోజుల్లో దీపావళి పండుగ రానుంది. దీంతో పండుగ సందర్భంగా రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో రైలులో ,రైల్వే ప్రాంగణాలో టపాసులు లేదా మండే స్వభావం గల వస్తువులను వెంట తీసుకు వెళ్లటం చట్టరీత్యా నేరమని ప్రకటించింది. రైళ్లలో లేదా స్టేషన్లలో అటువంటి వస్తువుల రవాణా వల్ల ప్రయాణీకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.
రైలులో మండే, పేలుడు స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించదగిన నేరమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి రైల్వేశాఖ నిషేదాలను దృష్టిలో ఉంచుకొని రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో బాణసంచా లేదా ఇతర పేలుడు, మండే స్వభావం గల వస్తువులను లగేజీ, పార్శిల్‌గా తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు రైల్వేశాఖ హెచ్చరిస్తోంది. ప్రజా భద్రత దృష్ట్యా, రైళ్లలో లేదా స్టేషన్లలో బాణసంచా లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను గమనించినట్లయితే, రైల్వే వారు అవసరమైన చర్యలను తీసుకునే నిమిత్తం వెంటనే సమీపంలోని రైల్వే సిబ్బందికి తెలియజేయవచ్చు. లేదా భద్రతా హెల్ప్‌లైన్ -139 కాల్ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. దక్షిణ మధ్య రైల్వే రైళ్ళలో ప్రయాణీకులకు సురక్షితమైన. ఇబ్బంది లేని రైలు ప్రయాణాన్ని పొందడానికి ప్రయాణికులు సైతం సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం
క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం
