LPG Gas Cylinder: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Updated on: Jan 03, 2026 | 11:31 AM

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జనవరి 1, 2026 నుండి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రూ.111 పెరిగాయి. ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఈ పెంపును ప్రకటించాయి. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

కొత్త సంవత్సరం ప్రారంభం వేళ కేంద్రం గ్యాస్ ధరలను కేంద్రం సమీక్షించింది. ప్రతీ నెలా ఒకటో తేదీన పెట్రో ఉత్పత్తులు… ఎల్పీజీ ధరల పైన సమీక్ష లో కొత్త ధరలను ఖరారు చేస్తారు. అందులో భాగంగా 2026 జనవరి 1న గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.111 లు పెంచాయి. అయితే.. గృహ అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఈ పెంపుదల వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల కే పరిమితం చేసారు. డొమెస్టిక్ గ్యాస్ పైన ఎలాంటి పెంపు లేదు. పెరిగిన ధరల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.111 పెరిగి రూ.1,691.50కి చేరుకుంది. ముంబైలో రూ.1,531.50 నుంచి రూ.1,642.5కు, కోల్‌కతాలో రూ.1,684 నుంచి రూ.1,795కి, చెన్నైలో రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం.. డిసెంబరులో భారీ వసూళ్లు

అయ్యబాబోయ్‌.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్‌

ఎంతకు తెగించావురా !! రీల్స్‌ కోసం ఇంత రిస్క్‌

ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

కోహ్లీ, రోహిత్‌ గురించి పఠాన్‌ అంత మాటనేశాడేంటి ??