అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??

Updated on: Nov 02, 2025 | 1:52 PM

లోన్ తీసుకోవాలనుకుంటే సిబిల్ స్కోరు అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది మెరుగ్గా ఉంటేనే.. లోన్‌ దక్కుతుంది. సిబిల్ స్కోరు బాగుంటే.. తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చాలామంది కస్టమర్లు.. సమయానికి ఈఎంఐలు కడుతూ సిబిల్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరి సిబిల్ స్కోరు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగటం లేదు. దీనికి అనేక కారణాలున్నాయంటున్నారు ఫైనాన్షియల్ నిపుణులు. క్రెడిట్‌ స్కోరు … క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (సీయూఆర్​)పై ఆధారపడి ఉంటుంది. అంటే.. కార్డు పరిమితి రూ.1 లక్ష అనుకుంటే, అందులో మీ వినియోగం రూ.30 వేల లోపునే ఉండేలా చూసుకోవాలి. అలాగాక.. ఎప్పుడూ 60, 70 వేలకు వాడేస్తూ ఉంటే.. క్రెడిట్ స్కోరు పెరగకపోగా, తగ్గటం ఖాయం. అలాగే, వేతనాన్ని బట్టి.. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్‌లోన్‌ లేదా ఇతర తనఖా రుణాలు ఉంటే క్రెడిట్‌ స్కోరు బాగానే ఉంటుంది. అయితే.. తగినంత వేతనం లేకపోయినా.. ఎడాపెడా రుణాలు తీసుకుని, తిరిగి కట్టలేకపోతే.. మొత్తానికే మోసం రావచ్చు. కొందరు కనిపించిన ప్రతి బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డుకు దరఖాస్తు పెడుతుంటారు. ఇలా తక్కువ టైంలో ఇలా దరఖాస్తు చేసుకునేవారి క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. అలాగే, ఏడాదికి 11 నెలలు సరైన టైంలో లోన్ ఈఎంఐ కట్టి.. ఒక్క నెల కట్టకపోయినా.. మీ స్కోరు తగ్గొచ్చు. అలాగే, ప్రతి నెలా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని.. ఏమైనా పొరబాట్లుంటే వెంటనే సరిచేసుకోవటం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్లు ఎక్కే పాములు.. ఎక్కడో కాదు.. మన కోనసీమలోనే..