Gold Price: గోల్డ్ ప్రియులకు బంపరాఫర్.. భారీగా తగ్గిన బంగారం ధర.. మన దగ్గర కూడా.. ఎంతటే..?
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి శుభవార్త. రెండు రోజులుగా బంగారం దిగివస్తున్న క్రమంలో సెప్టెంబర్ 2 శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ముగియడం
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి శుభవార్త. రెండు రోజులుగా బంగారం దిగివస్తున్న క్రమంలో సెప్టెంబర్ 2 శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ముగియడం, ఇప్పట్లో దగ్గరలో శుభకార్యాలు కూడా లేకపోవడమే బంగారం ధర తగ్గడానికి కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా.? లేదా అని చూడాలి. ఇక వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. మరి దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 50,950 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 50,730 రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47,100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం 51,380 రూపాయలు పలుకుతోంది. ఇటుల బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర 46,550 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,780 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 50,730 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఢిల్లీ, ముంబైలో కిలో వెండి 51,600 రూపాయలు ఉండగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 58,000 రూపాయలు పలుకుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos