Best FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు
మదుపుకు సురక్షితమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఎప్పటికీ ప్రాచుర్యంలోనే ఉన్నాయి. వివిధ బ్యాంకులు రకరకాల FDలను అందిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లను (8% వరకు) అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు కూడా మంచి రాబడులను ఇస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు సాధారణ వడ్డీ రేట్లు కలిగి ఉన్నాయి. మీ పొదుపును పెంచుకోవడానికి అధిక వడ్డీని ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం.
మదుపుకు పొదుపుకు ఎన్ని మార్గాలున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కు ఆదరణ తగ్గడం లేదు. సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఎఫ్‌డీలు అంత పాపులర్ మరి. అందుకే తరాలు మారుతున్నా.. ఇన్వెస్టర్లలో వీటికుండే గిరాకీ చెక్కుచెదరడం లేదు. దీనికి తగ్గట్టుగానే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రకరకాల ఎఫ్‌డీలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచాయి. పెద్ద బ్యాంక్‌లతో పోల్చితే చిన్న బ్యాంక్‌లు ఆకర్షించేలా వడ్డీని అందిస్తున్నాయి. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ బ్యాంక్‌లు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల కాలానికి గరిష్టంగా 8 శాతం వడ్డీని అందిస్తున్నాయి. slice స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొంచెం తక్కువగా 7.75 శాతం, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.60 శాతం, Utkarsh స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులు కూడా మంచి రాబడులను అందిస్తున్నాయి. అయితే స్థానిక ఫైనాన్స్ బ్యాంకులతో పోల్చితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. బంధన్ బ్యాంక్, RBL బ్యాంక్‌లు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై వార్షికంగా 7.20 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. అదే కాలానికి IDFC ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు సంప్రదాయ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తోంది. మొత్తానికి చూసుకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పర్వాలేదనిపించాయి . పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం చూస్తున్నాం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా
కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..
పాకిస్థాన్‌లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో