మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే
బంగారం, వెండి ధరలు నవంబరు 19 బుధవారం నాడు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,200, 22 క్యారెట్ల బంగారం రూ.1,100, కిలో వెండి రూ.3,000 పెరిగాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో తాజా ధరలు మారాయి. కొనుగోలుకు ముందు ధరలను సరిచూసుకోవడం ముఖ్యం.
బంగారం ధరలు సామాన్యులకు అంతుచిక్కడంలేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నవంబరు 19 బుధవారం నాడు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరిగి, రూ.1,24,860 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 పెరిగి రూ.1,14,450 కి చేరింది. కిలో వెండి పై రూ.3000 పెరిగి రూ.1,73,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,25,010, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,600 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,860 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,460, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,860 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,14,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,73,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నమోదైనవి. తరువాత పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్ చేసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఆలుగడ్డ ధర కేజీ రూ. లక్ష.. ఎక్కడో తెలుసా ??
కొనేదెలా.. తినేదెలా.. వెజి’ట్రబుల్స్’
షూటింగ్‌లో జక్కన్న టార్చర్ తట్టుకోలేకపోయా
