కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.! కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

|

Apr 23, 2024 | 8:20 PM

కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి వికృత రాజకీయ క్రీడలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని చెప్పిన ఆయన.. దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు. తనను తగ్గించే ప్రయత్నాలు చాలామంది చేసి భంగపడ్డారన్నారు కేసీఆర్. 'కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ'..

కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి వికృత రాజకీయ క్రీడలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని చెప్పిన ఆయన.. దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు. తనను తగ్గించే ప్రయత్నాలు చాలామంది చేసి భంగపడ్డారన్నారు కేసీఆర్. ‘కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’.. దీనిని ఎవ్వరూ కూడా తుడిచివేయలేరని చెప్పారాయన. తన ఆనవాళ్లు లేకుండా చేస్తామని కొందరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న కేసీఆర్.. అది సాధ్యమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా.. ప్రజల గురించి ఆలోచించకుండా.. హామీలను పట్టించుకోకుండా ఊదరగొడుతున్నారని దుయ్యబట్టారు కేసీఆర్. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తన తిట్టడానికేనా.? అని కేసీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తామన్నది నిజమే..

అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది వాస్తవమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆ మాటను కాంగ్రెస్ వినలేదని చెప్పారు. ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అది కరెక్ట్ కాదని, వద్దని నేను చెప్పినా వాళ్లు వినలేదు. దీంతో విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా.. ఆ తర్వాత మేం ఇండిపెండెంట్‌గా నిల్చొని గెలిచాం’ అని కేసీఆర్ వెల్లడించారు.