భద్రాద్రిలో జై శ్రీరామ్ ఇటుకలు.. వీడియో వైరల్
భద్రాచలం రామాలయం లో ఇక నుంచి జై శ్రీరామ్ ఇటుకలు రానున్నాయి .ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు సీతారామ చంద్ర స్వామి దర్శనానికి వస్తారు. ఇక నుంచి భక్తుల చేత తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ అయోధ్య భద్ర గిరిలో 'జై శ్రీరామ్' అచ్చుతో ఇటుకలను తయారు చేసేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పి౦చిన మోల్డ్ లను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్పాటిల్ పరిశీలించారు. నమూనాగా ఇటుకలను భక్తులతో తయారు చేయించారు.
రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల్లో ఆసక్తి కలిగిన వారితో, ఇటుకలను కొనుగోలు చేసే భక్తులుతో స్వచ్ఛందంగా ఈ ఇటుకలను తయారు చేయించేలా కార్యాచరణ రూపొందించి, అమలు చేసే విషయమై కలెక్టర్ దేవస్థానం ఈవో దామోదర్రావుతో చర్చించారు. అయితే ఇలా జైశ్రీరామ్ పేరుతోతయారు చేసిన ఇటుకలను త్వరలో రామాలయంలో ఉంచి రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులకు విక్రయించనున్నారు. రామానుగ్రహంగా విక్రయించే ఇటుకల్లో 100రూపాయలకురెండు ఇటుకల చొప్పున భక్తులకు అమ్మే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు సొంత ఇల్లు కట్టుకునే వారు శంఖుస్థాపన చేసి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు. మొదట ఇటుక పై రామ నామం రాసి వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఆలయ భక్తులకు ఇటుకలను అందించే ఏర్పాట్లు చేస్తోంది
Published on: Nov 12, 2025 08:21 PM