Telangana: అర్ధరాత్రి దాటిందంటే గుడారంలో గుట్టుచప్పుడు యవ్వారం.. తెలిస్తే ఫ్యూజులౌట్

|

Jul 15, 2024 | 4:56 PM

పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్రపూజల కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు, గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని..

పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్రపూజల కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు, గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లి ఎస్సారెస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గుడారం ఏర్పాటు చేసుకుని, గత రెండు రోజులుగా అర్థరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేస్తున్నారని, అక్కడే వంటలు వండి, ఎవరికీ అనుమానం రాకుండా చుట్టుపక్కల వారిని కూడా పిలిచి అన్నదానం చేశారని తెలుస్తోంది, అన్నం తిన్నవారికీ వాంతులు, విరోచనాలు అవుతున్నాయని భయందోళనకు గురవుతున్నారు.

క్షుద్రపూజలు చేసిన ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి, వారి కార్యకలాపాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అక్కడ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారా , అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని, క్షుద్ర పూజల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. పెద్దపల్లి మండలంలో ఇలాంటి క్షుద్ర పూజలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Jul 15, 2024 04:56 PM