మీ టూ వీలర్‌ పోయిందా.. ఇక్కడుందేమో చూసుకోండి

Updated on: May 23, 2026 | 11:10 AM

కూకట్‌పల్లి, బాచుపల్లి ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ బాయ్స్‌గా పని చేస్తూ విలాసాల కోసం చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది.

నగరంలో బైక్‌ దొంగతనాలకు పాల్పుడుతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కూకట్‌పల్లి, బాచుపల్లి పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి సుమారు రూ.10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాటిలో యమహా, యాక్టివా, డియో, పల్సర్ వంటి బైకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులకు సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అయితే, విలాసాలకు అలవాటుపడిన ఈ ముఠా..సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీల బాట పట్టారు. ఖర్చుల కోసం రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ ముఠా కేవలం బాచుపల్లిలోనే కాకుండా పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, ఆల్వాల్, కూకట్‌పల్లి, నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కుత్బుల్లాపూర్ ఏసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు

మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు

పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్‌ షాక్‌

Follow Us