AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో వేడి నీరు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

వర్షాకాలంలో వేడి నీరు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Samatha J
|

Updated on: Jul 30, 2025 | 12:15 PM

Share

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ కాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగడానికి ఇదే కారణం. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి వ్యాధులు త్వరగా వస్తాయి. ఈ సీజన్‌లో కొంతమంది వేడినీరు తాగుతారు. కానీ చాలా మంది వేడినీటిని లైట్ తీసుకుంటారు. కానీ వేడి నీరు తాగే అలవాటు చేసుకుంటే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు.

వేడి నీటితో కలిగే లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. వర్షాకాలంలో వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం కూడా తొలగిపోతుంది. ఇది శ్వాసను సులభతరం చేస్తుంది. వర్షాకాలంలో తరచుగా జలుబు, దగ్గు వస్తుంది. అటువంటి పరిస్థితిలో వేడి నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గొంతుకు రిలీఫ్ ఇస్తుంది. ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధిస్తుంది. దీనితో పాటు వేడి నీరు చర్మానికి కూడా మంచిది. శరీరం లోపలి నుండి శుభ్రంగా ఉన్నప్పుడు, ముఖం కూడా మెరుస్తుంది.చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగుతారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. వర్షాకాలంలో కూడా ఈ అలవాటును కొనసాగించాలి. బయటి ఆహారం ఎక్కువగా తినేవారు తప్పక దీన్ని అలవాటు చేసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో

 

Published on: Jul 30, 2025 12:00 PM