Loading video

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

|

Mar 21, 2025 | 5:49 PM

వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇవి ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మనం తినే మామిడి పండ్లు సహజంగా పండాయా..? లేక రసాయనాలతో మగ్గబెట్టినవా..? అనే విషయం చాలా ముఖ్యమైనది. మార్కెట్లో ఎక్కువగా మగ్గబెట్టిన పండ్లే కనిపిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం.

కాబట్టి సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అవసరం. సహజంగా పండిన మామిడి పండ్లు కొద్దిగా గట్టిగా ఉంటాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు ఎక్కువగా మెత్తగా ఉంటాయి. సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న చిన్న గీతలు, కొద్దిగా మచ్చలు ఉండొచ్చు. కానీ అవి ప్రమాదకరం కావు. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లపై ఆకస్మికంగా మచ్చలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఇవి అసహజంగా కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు వేరువేరు రంగుల్లో కనిపిస్తాయి. కొన్ని చోట్ల పసుపు, కొన్ని చోట్ల ముదురు నారింజ రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు పూర్తిగా ఒకే రంగులో మెరిసిపోతాయి. అవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కాబట్టి మీరు కొనేటప్పుడు ఈ తేడాను గమనించండి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది’ పవన్ ఎమోషనల్‌