ఫ్రీగా అయోధ్య హారతి పాసులు.. బుక్‌ చేసుకోండిలా

|

Dec 31, 2023 | 7:36 PM

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్​లైన్​లో జారీ చేస్తున్న పాసులను ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తోంది ట్రస్టు. హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుందని సంబంధిత అధికారి అన్నారు.

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్​లైన్​లో జారీ చేస్తున్న పాసులను ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తోంది ట్రస్టు. హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుందని సంబంధిత అధికారి అన్నారు. భద్రతా కారణాల రీత్యా హారతికి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారని, భవిష్యత్​లో ఈ పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అన్నారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్​పోర్ట్​లో ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చని తెలిపారు. ఆన్​లైన్​లో 20 చొప్పున పాసులు అందుబాటులో ఉంటాయని, నచ్చిన తేదీలకు ముందస్తు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డిస్కౌంట్‌ ఎఫెక్ట్‌.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు

అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు

25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే