AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ ఆమ్లెట్‌'' పోలీసుల అండర్‌కవర్‌..

ఆపరేషన్‌ “ఆమ్లెట్‌” పోలీసుల అండర్‌కవర్‌..

Phani CH
|

Updated on: May 01, 2026 | 7:15 PM

Share

ఔరంగాబాద్ పోలీసులు గుజరాత్‌లోని సూరత్‌లో 15 రోజుల అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఆమ్లెట్ బండి వ్యాపారులుగా మారువేషంలో ఉంటూ, అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 3 లక్షల చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై ఔరంగాబాద్, నాసిక్‌లో పలు కేసులున్నాయి. ఈ సాహసోపేత ఆపరేషన్ నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి పోలీసులు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ అదిరిపోయింది. 15 రోజుల పాటు వారు చేసిన సాహసోపేత ఆపరేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. మారువేషంలో వారు రోడ్డు పక్కన బండిలో ఆమ్లెట్‌ అమ్మే చిరు వ్యాపారులుగా మారారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడానికి గుజరాత్‌లోని సూరత్‌లో 15 రోజులు మారువేషంలో మకాం వేశారు. చిరు వ్యాపారులుగా నటించారు. ఉల్లిపాయలు తరుగుతూ, కస్టమర్లకు ఆమ్లెట్లు, ఎగ్‌ బుర్జీ వడ్డిస్తూ దొంగల్ని పట్టుకునేందుకు వెయిట్‌ చేశారు. నిందితులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఫుడ్ స్టాల్‌లో కానిస్టేబుళ్లు యోగేష్ నవ్‌సరే, ప్రదీప్ దండ్వటే నిఘా పెట్టారు. రెండు వారాల తర్వాత నిందితుల గుర్తింపును నిర్ధారించుకుని గురుదాస్‌ ను , అమోల్ ను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 19న ఓ అపార్ట్‌మెంట్‌లో రూ. 3 లక్షల విలువైన క్యాష్‌, వస్తువులు చోరీ అయ్యాయి. 150 సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా, ఒక నిందితుడి ముఖం పోలీసులకు స్పష్టంగా కనిపించింది. పాత నేర చరిత్ర రికార్డులతో సరిపోల్చగా, నిందితులు సూరత్‌లో ఉన్నట్లు తేలింది. ఆ ఆనవాళ్ళే దర్యాప్తు అధికారులకు దారి చూపింది. విచారణలో నిందితులు వ్యవహరిస్తున్న తీరు చూసి పోలీసులే షాకయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, లాకర్లను పగులగొట్టి క్షణాల్లో మాయమవ్వడం వీరి శైలి. కార్లకు అనేక రకాల నకిలీ నంబర్ ప్లేట్లను వాడుతూ పోలీసుల కళ్లు కప్పి చాకచక్యంగా పనిముగించుకుని తప్పించుకుంటారు. అంతేకాదు సొంత ఫోన్లు వాడకుండా యాప్‌ల సహాయంతో టోల్ గేట్లు లేని రూట్లను గుర్తించి ప్రయాణించేవారు. ఎంతటి నేరస్తులైనా, పోలీసులు తలచుకుంటే చిక్కక తప్పదు. ఈ కేసులోనూ అదే జరిగింది. సీనియర్ అధికారుల ఆదేశాలతో , కానిస్టేబుళ్లు యోగేష్, ప్రదీప్ దండ్వటె సూరత్‌కు వెళ్లి, అనుమానితులున్న ప్రదేశంలో ఒక ఫుడ్ కార్ట్ వద్ద నిఘా వేసి దొంగల ఆట కట్టించారు. నిందితులపై ఔరంగాబాద్‌లో 8 కేసులు, నాసిక్‌లో 28 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోర్టు నిందితులను మే 5 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఇతర కేసుల్లో వీరి ప్రమేయం గురించి పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది

ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్‌ ట్విస్ట్‌

Follow Us